Saturday, 14 September 2019

ర్యాంకుల్లో మన వర్సిటీలు ఎక్కడ ? టైమ్స్ ర్యాంకింగ్లో టాప్ 200లో ఒక్కటీ లేదు :


i.       టైమ్స్‌ ఉన్నత విద్య ప్రపంచ ర్యాంకింగుల్లో భారతీయ విశ్వవిద్యాలయాలు దరిదాపుల్లో కనిపించలేదు. ప్రపంచవ్యాప్తంగా 92 దేశాల్లోని 1,400 విశ్వవిద్యాలయాలను వడపోసి టైమ్స్‌ సంస్థ 2020 ర్యాంకులను ప్రకటించింది. ఈ జాబితాలో 56 భారతీయ విద్యాసంస్థలు నిలిచినప్పటికీ ఏవీ 300లోపు ర్యాంకు దక్కించుకోలేకపోయాయి.  బెంగుళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సాధించిన 301- 350 ర్యాంకే భారతీయ విద్యాసంస్థలకు దక్కిన అత్యుత్తమ ర్యాంకు.  భారత్‌ నుంచి 1000+ ర్యాంకుల్లో 56 విద్యాసంస్థలు నిలవగా అందులో తొలి 9 స్థానాలను ఐఐఎస్‌ఈ, ఐఐటీలే దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌ ఐఐటీ టాప్‌లో నిలిచింది. విద్యాబోధనలో సంస్థ పనితీరు, పరిశోధన, విజ్ఞాన బదిలీ, ఇంటర్నేషనల్‌ ఔట్‌లుక్‌ ఆధారంగా ర్యాంకులు నిర్ధారించారు. వరుసగా నాలుగో ఏడాదీ ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...