Friday, 13 September 2019

ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మార్పు

దేశ రాజధాని న్యూఢిల్లీలో గల ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మారింది. దివంగత కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పేరును ఈ స్టేడియానికి పెట్టారు.కేంద్ర హోం మంత్రి అమిత్ షా సెప్టెంబర్ 12న ఈ స్టేడియానికి కొత్తగా నామకరణం చేశారు. దేశ రాజధాని ప్రాంతంలో క్రికెట్‌కు ప్రాచుర్యం తీసుకురావడం కోసం జైట్లీ చేసిన సేవలను గౌరవిస్తూ ఈ స్టేడియం పేరుమార్చాలని నిర్ణయం తీసుకున్నారు. 1999 నుంచి 2012 వరకు 13 ఏళ్ల పాటు ఢిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) అధ్యక్షుడిగా జైట్లీ కొనసాగారు. మరోవైపు కోట్లా స్టేడియంలోని కొత్త పెవిలియన్ స్టాండ్‌కు భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో జైట్లీ కుటుంబ సభ్యులతో పాటు క్రీడల మంత్రి కిరణ్ రిజిజు, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ పాల్గొన్నారు.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...