బూర్గుల రామకృష్ణారావు వర్ధంతి – September 14
నైజాం రాజ్యంపై కలం పట్టి కవులతో కవాతు చేయించిన న్యాయవాది బూర్గుల రామకృష్ణారావు (13 March 1899 - 14
September 1967). భాషా పరిరక్షణ కోసం తెలంగాణలో అస్తిత్వ పోరాటానికి తొలిగా బీజాలు చల్లిన ఉద్యమకారుల్లో ఒకరాయన.
గ్రంథాలయాల స్థాపనతో సాహితీ, సాంస్కృతికోద్యమాలకు
తెరతీసి, స్టేట్ కాంగ్రెస్ స్థాపనతో నిజాంనే ఎదిరించిన ఉద్యమయోధుడు. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా భూ
సంస్కరణలకు శ్రీకారం చుట్టి పాలకులకు మార్గదర్శిగా నిలిచిన దార్శనికుడు.
బూర్గుల 1899 సంవత్సరంలో
మార్చి 13న కల్వకుర్తికి సమీపంలోని పడకల్ గ్రామంలో జన్మించారు.
నగరంలోని ధర్మవంత్ ఎక్సెల్సియర్ హైస్కూలో చదివారు. పూనాలోని ఫర్గుసన్ కాలేజీలో బీఏ(ఆనర్స్) పూర్తి చేశారు. ముంబయి విశ్వవిద్యాలయం నుంచి 1913లో న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు.
చదువు పూర్తైన తర్వాత హైదరాబాద్లో
న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. న్యాయవాద వృత్తిని కొనసానగిస్తూనే నగరంలో సాహితీ సృజన చేస్తూ, గ్రంథాలయోద్యమంలో, నిజాం వ్యతిరేక పోరాటాలలో, జాతీయ కాంగ్రెస్ రాజకీయాలలో క్రియాశీలంగా పాల్గొన్నారు.
బహుభాషా వేత్త.. సాహితీ తత్వవేత్త :
బూర్గుల బహుభాషావేత్త, సాహితీవేత్త. తెలుగు, సంస్కృతం, పార్శీభాషల్లో పలు
గ్రంథాలను రచించారు. జగన్నాథ పండితరాయల లహరీపంచకము, శంకరాచార్యుల సౌందర్యలహరి, కనకధార రాస్తవమును తెలుగులోకి అనువదించారు. సంస్కృతంలో కృష్ణశతకం, వేంకటేశ్వర సుప్రభాతం, శారదస్తుతి, గౌరీవాస్తు, వాణీవాస్తు, లక్ష్మీస్తుతి, శ్రీకృష్ణాష్టకం
రచించారు.
సారస్వత వ్యాస ముక్తావళి పేరుతో వ్యాసాలు ప్రచురించారు. తెలుగు భాష,
సాహిత్యం కోసం వానమామలై, కాళోజీ, దాశరథి, నారాయణరెడ్డితో కలిసి తెలంగాణ రచయితల సంఘం స్థాపించారు.
బ్రిటీష్వాళ్లు భారత్ను వీడిన తర్వాత నిజాం స్టేట్లో ఇండియా ప్రతినిధి (సివిల్ సర్వెంట్) కేఎం మున్షీ ముఖ్యమంత్రిగా ఏర్పాటైన కేబినెట్లో బూర్గుల విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు.
1952లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో షాద్నగర్ ప్రాదేశిక నియోజకవర్గానికి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు.
భూ సంస్కరణలకు శ్రీకారం..
చారిత్రాత్మకమైన భూ సంస్కరణకు శ్రీకారం చుడుతూ హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ వ్యవసాయ కౌలుదారీ చట్టం 1950కి తీసుకువచ్చారు.
తెలుగు భాష
మాట్లాడే ప్రజలు అత్యధికంగా ఉన్న భూభాగాలను కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. నూతన రాష్ట్ర ఆవిర్భావంతో హైదరాబాద్ స్టేట్ ప్రభుత్వం రద్దయింది.
తర్వాత బూర్గులను కేరళ రాష్ర్టానికి గవర్నర్గా
భారత ప్రభుత్వం నియమించింది. 1956 నుంచి 1960 వరకు కేరళకు గవర్నర్గా, అనంతరం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా
రెండేళ్లపాటు పనిచేశారు.
1962లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. నాలుగేళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.
1967లో సెప్టెంబరు 14న బూర్గుల కన్నుమూశారు.
No comments:
Post a Comment