Thursday, 12 September 2019

దాహం తీరుస్తూ... ఉపాధి పొందుతూ.. ‘ఐ- జల్’ :

i.స్వయం సహకార, ఉపాధి సంఘాల మహిళలను సమన్వయం చేసుకుంటూ సేఫ్ వాటర్ నెట్వర్క్ సంస్థ... ‘ఐ- జల్’ పేరిట తెలంగాణలోని 17 జిల్లాల్లో ఉచితంగా నీటిశుద్ధి కేంద్రాలను స్థాపించింది.
ii.‘మన నీరు- మన ఆరోగ్యం’ అనే నినాదంతో రాష్ట్రంలో 250కి పైగా నీటిశుద్ధి కేంద్రాలను నెలకొల్పి, కేవలం ఐదు రూపాయలకే 20 లీటర్ల నీటిని అందిస్తోంది. వాటి నిర్వహణలో మహిళలను భాగస్వామ్యం చేస్తూ, వారికి ఆర్థిక భరోసా ఇస్తోంది.
iii.కనీస అవసరాల్లో ఒకటైన తాగునీరును ఉచితంగా పేదవారికి అందించాలనే ఉద్దేశంతో సేఫ్ వాటర్ నెట్ వర్క్ స్వచ్ఛంద సంస్థను 2009లో రవీంద్రసేవక్ స్థాపించారు.
iv.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ సంస్థ పనిచేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో మంచినీటి సదుపాయం కల్పించాల్సిన ప్రాంతాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గుర్తిస్తుంది. ఆ సమాచారంతో రాష్ట్రాల సమన్వయంతో ఎక్కడెక్కడ కేంద్రాలను స్థాపించాలో ఈ సంస్థ నిర్ణయిస్తుంది.
v.పదేళ్ల కిందట మెదటి ప్లాంటును పూర్వ వరంగల్ జిల్లాలోని నిజాంపల్లిలో స్థాపించారు.
vi.ప్రస్తుతం తెలంగాణ 17 జిల్లాల్లోని దాదాపు 250 ప్లాంట్లతో పాటు మహారాష్ట్రలోనూ 50 కేంద్రాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న 14 రాష్ట్రాలకూ సేవలను విస్తరించే పనిలో ఉంది ఈ సంస్థ.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...