i. తెలంగాణ వీరప్పన్గా పేరొందిన ఎడ్ల శ్రీనివాస్కు హైకోర్టులో ఊరట లభించింది.
ii. రామగుండం పోలీసు కమిషనర్.. అతడిపై జారీచేసిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్, జస్టిస్ అభిషేక్రెడ్డితో కూడిన ధర్మాసనం రద్దు చేసింది.
iii. తెలంగాణ వీరప్పన్ గా చలామణి అవుతూ అటవీశాఖను శాసిస్తున్నాడు. అడవులను అడ్డంగా నరుకుతూ దర్జాగా తప్పించుకుంటున్నాడు. ఇరవై ఏళ్లుగా అడవి రాజుగా వెలిగిపోతున్నాడు.
iv. తెలంగాణలో అడవులను నరుకుతూ ప్రారంభమైన కలప దొంగ ప్రస్థానం.. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ కు విస్తరించింది. టేకు స్మగ్లింగ్ తో కోట్లు కూడబెడుతూ 3 రాష్ట్రాల్లో హవా నడిపిస్తున్నాడు. 20 ఏళ్ల కిందట అతి సామాన్యుడిగా ఉన్నోడు.. ఇవాళ అసాధారణ స్థాయికి చేరాడు.
v. అడవుల్లో చెట్లను నరుకుతూ కలప స్మగ్లింగ్ చేయడమే వృత్తిగా పెట్టుకుని ప్రత్యేక సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. అనుచరులను భారీగా పెట్టుకుని అడ్డూ అదుపు లేకుండా విజృంభిస్తున్నాడు.
vi. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన సదరు చెట్ల దొంగకు మూడు రాష్ట్రాల్లో నెట్వర్క్ ఉందట. తెలంగాణలో అత్యధిక అటవీ ప్రాంతమున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాను టార్గెట్ చేసుకొని తన కార్యకలాపాలను విస్తరిస్తున్నాడు.
vii. గోదావరి నది తీరానికి మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు దగ్గరగా ఉండటంతో ఈ జిల్లాపై దృష్టి సారించాడు. కాటారం, మహదేవ్ పూర్, ఏటూరు నాగారం, తాడ్వాయి తదితర మండలాల్లో వందల సంఖ్యలో అనుచరులు ఉండటం గమనార్హం.
viii. మార్గమధ్యంలో ఎవరైనా అధికారులు ఆపితే తెలంగాణ వీరప్పన్ పేరు చెబితే ఆ అధికారులు చూసీచూడనట్లు వదిలేస్తారట. అలా ఏ టీముకు ఎంతివ్వలో రేట్ ఫిక్స్ చేసి ఈ దొంగ దందాను యథేచ్చగా కొనసాగిస్తున్నాడు.
ix. అడవుల నుంచి పూచిక పుల్ల బయటకు వెళ్లొద్దని సీఎం కేసీఆర్ తాజాగాఆదేశించారు. జంగల్ బచావో, జంగల్ బడావో (అడవులను కాపాడండి, అడవులను పెంచండి) అంటూ పిలుపునిచ్చారు. కలప స్మగ్లర్లపై పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. అంతేకాదు రక్షణ దళాల ఏర్పాటుతో పాటు సర్పంచులకు అడవులను కాపాడే బాధ్యతలు అప్పగించాలనే అంశం పరిశీలిస్తున్నారు

No comments:
Post a Comment