Saturday, 14 September 2019

విక్రమ్ కోసం రంగంలోకి నాసా :

i. జాబిల్లి ఉపరితలంపై ఉలుకూపలుకూ లేకుండా ఉన్న ‘విక్రమ్’ ల్యాండర్తో సంబంధాలు ఏర్పరచుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చిట్టచివరి ప్రయత్నాలను కొనసాగిస్తోంది.
ii. ఇందులో భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ను రంగంలోకి దించింది. మన ల్యాండర్తో సంధానమయ్యేందుకు ఆ సంస్థ సంకేతాలను పంపుతోంది.
iii. నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ (జేపీఎల్) తన డీప్ స్పేస్ నెట్వర్క్ (డీఎస్ఎన్)లోని భూ కేంద్రాల ద్వారా విక్రమ్కు రేడియో తరంగాలను పంపింది.
iv. భూ కేంద్రంతో కమ్యూనికేషన్ సాగించేలా ల్యాండర్ను ప్రేరేపించడం దీని ఉద్దేశం. జాబిల్లిపై 14 రోజుల పగటి సమయం ఈ నెల 20-21తో ముగుస్తుంది. ఆ తర్వాత విక్రమ్లోని సౌరఫలకాలకు శక్తి అందదు.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...