Saturday, 14 September 2019

సుదూరపు గ్రహంపై నీటి జాడ :


i.          మన భూగోళాన్ని పోలిన మరో గ్రహంపై నీటి జాడ ఉన్నట్టు లండన్విశ్వవిద్యాలయ ఖగోళ శాస్త్రవేత్తలు తొలిసారిగా కనుగొన్నారు. అక్కడ జీవుల మనుగడకు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఉన్నట్టు అంచనాకు వచ్చారు.
ii.       మన సౌర వ్యవస్థకు ఆవల, భూమికి 110 కాంతి సంవత్సరాల దూరాన గ్రహముంది. భూమికంటే 2.5 రెట్లు పెద్దదైన కె2-18బి అనే గ్రహంపై మైనస్‌ 8 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. చిన్న నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది.
iii.     అక్కడి వాతావరణంలో నీటి ఆవిరితో పాటు హైడ్రోజన్‌, హీలియం ఉన్నాయి. మీథేన్‌, నైట్రోజన్లు కూడా ఉండే అవకాశముంది. కె2-18బి జీవనయోగ్య గ్రహం కాకపోవచ్చని మరికొందరు పరిశోధకులు అంటున్నారు.
iv.     భూమిని పోలిన గ్రహాలు విశ్వంలో మరెన్నో ఉన్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు తేల్చినా... మరో గ్రహంపై నీటి జాడ, జీవన యోగ్య పరిస్థితులు ఉన్నట్టు గుర్తించడం మాత్రం ఇదే తొలిసారి.

No comments:

WRITING A RESEARCH REPORT

 రీసెర్చ్ రిపోర్ట్ రాయడం పరిశోధన నివేదిక అనేది సాంప్రదాయిక నిర్మాణం లేదా ఆకృతిని అనుసరించి కఠినంగా ఆకృతీకరించిన పత్రంలో పరిశోధన మరియు దాని ఫ...