Thursday, 12 September 2019

గ్రామీణ వైద్యం బలోపేతం.. వైద్య సిబ్బందికి ఆధునిక శిక్షణ. ఎకో ట్రస్టుతో పరస్పర ఒప్పందం :


i.          దేశవ్యాప్తంగా ఆరోగ్య ఉప కేంద్రాలనుహెల్త్అండ్వెల్నెస్సెంటర్లుగా తీర్చిదిద్దాలని ఇప్పటికే నిర్ణయించిన కేంద్రం.. ఇందులో భాగంగా పల్లె వైద్యంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్సిబ్బందికి అవసరమైన ఆధునిక శిక్షణ ఇవ్వాలని సంకల్పించింది.
ii.       ఇందుకోసంఎకో(ఎక్స్టెన్షన్ఫర్కమ్యూనిటీ హెల్త్కేర్ఔట్కమ్స్‌) ట్రస్టుతో ఇటీవల కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరస్పర అవగాహన ఒప్పందం(ఎంఓయూ) కుదుర్చుకుంది.
లక్ష్యమిదే..
iii.     ప్రాథమిక వైద్యాన్ని బలోపేతం చేయడమే  ప్రధాన లక్ష్యం. క్లిష్టతరమైన వ్యాధులను త్వరితగతిన గుర్తించడం.
iv.     లక్ష్య సాధనలో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్సిబ్బంది సేవలను సమర్థంగా వినియోగించుకోవడం.
v.       వైద్యసిబ్బందికి ఎప్పటికప్పుడూ శిక్షణ తరగతులు నిర్వహించడం. ప్రతి అంశానికి సంబంధించిన సమాచారాన్ని   డిజిటల్లో పొందుపర్చడం.

No comments:

Human Body

 మానవ శరీరం గురించి మనం మానవ శరీరాన్ని మైక్రోస్కోపిక్ స్థాయిలో "విచ్ఛిన్నం" చేస్తే, కణం దాని అత్యంత ప్రాథమిక యూనిట్‌గా ఉంటుంది. సగ...