Monday, 4 February 2019

క్రీడలకు 200 కోట్లు పెంపు

2019 తాత్కాలిక బడ్జెట్‌లో క్రీడా రంగానికి నిధులు స్వల్పంగా పెరిగాయి. కేంద్ర మంత్రి పియూశ్‌ గోయల్‌ ప్రవేశపెట్టిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో క్రీడలకు రూ. 214.20 కోట్లు పెంపుదల లభించింది. గత ఏడాది 2002.72 కోట్లు కాగా, 2019-2020కి 2216.92 కోట్లు కేటాయించారు. జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ (సారు), జాతీయ క్రీడాభివృద్ది నిధి (ఎన్‌ఎస్‌డీఎఫ్‌)లకు నిధులు పెంచారు. జాతీయ శిక్షణ శిబిరాలు సహా క్రీడా రంగాన్ని చూస్తోన్న సారు నిధులు రూ. 395 నుంచి రూ.450 కోట్లకు పెరిగింది. ఎన్‌ఎస్‌డీఎఫ్‌ నిధులు రూ. 2 కోట్ల నుంచి రూ.70 కోట్లకు పెరిగింది. క్రీడాకారుల ప్రోత్సాహనికి ఉద్దేశించిన ప్రోత్సాహక నిధిని రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు పెంపుదల చేశారు. ఖేలో ఇండియా కార్యక్రమ నిధులు సైతం రూ. 50.31 కోట్లు పెంచారు. ఖేలో ఇండియాకు గతంలో రూ. 550.69 కోట్లు కేటాయించగా, తాజాగా రూ.601 కోట్లు ఇవ్వనున్నారు. జాతీయ క్రీడా సమాఖ్యలకు ఇచ్చే నిధుల్లో స్వల్ప కోత పడింది. ఈ నిధులు రూ. 245.13 కోట్ల నుంచి రూ. 245 కోట్లకు తగ్గింది. ఓవరాల్‌గా గత బడ్జెట్‌ల మాదిరిగానే కేవలం నిర్వహణ వ్యయం కోసమే నిధులు కేటాయింపు జరిగింది.

No comments:

భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం

 భారత్ ఫ్యూచర్ సిటీని గ్లోబల్ అర్బన్ హబ్‌గా అభివృద్ధి చేయడానికి యుఎఇ-తెలంగాణ భాగస్వామ్యం వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026లో, భారతదేశపు మొట్టమొదటి న...