లోక్‌సభలో ఆర్థిక మంత్రి పియూష్ గోయల్ తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌కు సంబంధించిన సమాచారం ఇదీ
- వేతన జీవులకు స్టాండర్డ్ ట్యాక్స్ డిడక్షన్‌ను రూ.40 వేల నుంచి రూ.50 వేలకు పెంపు
- ఏడాదికి రూ.6.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు కూడా ప్రావిడెంట్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే పన్ను కట్టాల్సిన అవసరం లేదు
- ఏడాదికి రూ. 5 లక్షల ఆదాయం ఉన్న వేతన జీవులకు పూర్తి పన్ను రీబేట్
- రానున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆదాయ పన్ను పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతుంది
- ఈ నిర్ణయం కారణంగా 3 కోట్ల మంది ఆదాయ పన్నుదారులకు లబ్ధి చేకూరనుంది.
- ఆదాయపన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేకపోయినా ఫైలింగ్ రిటర్న్స్‌ను మాత్రం సులభతరం చేసింది.
- రెండేళ్లలోనే ఐటీ రిటర్న్స్‌లో ఎలాంటి అధికారుల పాత్ర లేకుండా ఎలక్ట్రానిక్ విధానం ద్వారా ఫైల్ చేసే అవకాశం కల్పిస్తామని ఆర్థిక మంత్రి గోయల్ చెప్పారు.
- జీఎస్టీని క్రమంగా తగ్గిస్తూ వస్తున్నాం. దీనివల్ల వినియోగదారులకు రూ.80 వేల కోట్ల మేర ఊరట కలిగింది. రోజువారీ వస్తు, సేవలు ప్రస్తుతం సున్నా నుంచి 5 శాతం పన్ను పరిధిలోనే ఉన్నాయి
- దేశంలో ప్రస్తుతం మానవ రహిత లెవల్ క్రాసింగ్స్ లేనే లేవు.
- స్వదేశంలో తయారైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌తో ప్రయాణికులకు ప్రపంచస్థాయి అనుభవం కలుగుతుంది
99.4 శాతం రిటర్న్‌లను ఎలాంటి స్క్రూటీనీ లేకుండా ఆమోదించాం
- ప్రత్యక్ష పన్నుల రాబడులు 2013-14లో రూ.6.38 లక్షల కోట్లుగా ఉండగా.. అది ఇప్పుడు రూ.12 లక్షల కోట్లకు పెరిగింది. పన్నులు కట్టేవాళ్లు 3.79 కోట్ల నుంచి 6.85 కోట్లకు పెరిగారు
- మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగేలా పన్నులను ప్రభావవంతంగా తగ్గించగలిగాం
- పీఎం ఉజ్వల యోజన కింద గ్రామీణ గృహాలకు 8 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాం.. ఇప్పటికే 6 కోట్ల కనెక్షన్లు ఇచ్చాం
No comments:
Post a Comment