ఇండియాలో డేటా, వాయిస్ కాల్స్ ధర ప్రపంచంలోనే అతి తక్కువగా ఉంది. ఇక దేశంలో మొబైల్, మొబైల్ విడి భాగాల తయారీ సంస్థలు 2 నుంచి 268కి పెరిగాయి
- గత ఐదేళ్లలో 34 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలు తెరిచాం. ఆధార్‌ను అన్నింట్లోనూ అమలు చేస్తున్నాం. పేద, మధ్య తరగతి వర్గాలు ప్రభుత్వ పథకాలను నేరుగా పొందేందుకు ఇది ఉపయగపడుతుంది.
- ఈ ఏడాది ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.58166 కోట్లు కేటాయిస్తున్నాం. ఇది గతేడాది కంటే 21 శాతం అధికం.
- గత ఐదేళ్లలో అన్ని రంగాల కార్మికుల కనీసం వేతనం 42 శాతం మేర పెరిగింది
- ప్రత్యక్ష పన్నుల వ్యవస్థను సులుభతరం చేశాం. ఇది పన్ను కట్టేవాళ్లకు మేలు చేస్తుంది. దీనివల్ల పన్ను రాబడులు పెరగడంతోపాటు రిటర్న్ ఫైలింగ్స్ కూడా పెరిగాయి.
- ప్రపంచంలోనే ఇండియా అత్యంత వేగంగా హైవేల నిర్మాణం సాగిస్తున్నది
- ప్రతి రోజు దేశంలో 27 కిలోమీటర్ల హైవేలను నిర్మిస్తున్నాం
- దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేశాం
- సాగర్‌మాలాతో కార్ల ఎగుమతి, దిగుమతి వేగవంతం అవుతుంది
- 40 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్‌ను అమలు చేశాం
- దీనికింద ఇప్పటికే రూ.35 వేల కోట్లు సైనికులు అందజేశాం
- రక్షణ బడ్జెట్‌ను రూ.3 లక్షల కోట్లకుపైగా పెంచాం
- ఇది ప్రపంచంలోనే ఇది అతిపెద్ద పెన్షన్ స్కీమ్
- పది కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులకు ఈ పెన్షన్ స్కీమ్ లబ్ధి చేకూరుస్తుంది
- గ్రాట్యుటీని రూ.10 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నాం
- 50 శాతం జీడీపీ 42 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల నుంచే వస్తుంది
- ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మంధన్ (మెగా పెన్షన్ యోజన) పేరుతో అసంఘటిత రంగ కార్మికులకు నెలకు కనీస పెన్షన్. నెలకు రూ.100 కంట్రిబ్యూషన్‌తో 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3 వేల కనీస పెన్షన్
-- కిసాన్ సమ్మాన్ నిధికి ఏడాదికి రూ.75 వేల కోట్ల ఖర్చు అవుతుంది
- ఏడాదిలో మూడు విడతల్లో ఈ మొత్తం రైతుల బ్యాంక్ అకౌంట్లకు నేరుగా చేరుతుంది
- చిన్న, సన్నకారు రైతులకు కనీస ఆదాయం కల్పించే ఉద్దేశంతో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చాం
- ఈ పథకం కింద రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తాం. ఇది వంద శాతం కేంద్ర ప్రభుత్వమే ఈ ఖర్చు భరిస్తుంది. ఇది నేరుగా 12 కోట్ల రైతు కుటుంబాలకు మేలు చేస్తుంది.
- ఆయుష్మాన్ భారత్ కారణంగా 50 కోట్ల మంది నిరుపేదలకు ఆరోగ్యంపై 3 వేల కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా చేశాం
- 22 పంటలకు ఒకటిన్నర రెట్లు ఎక్కువ కనీస మద్దతు ధరను ప్రకటించాం
- బడ్జెట్ తొలి 15 నిమిషాలు మోదీ ప్రభుత్వ ఘనతలు చెప్పిన పియూష్ గోయల్
- దేశంలో 5.45 లక్షల గ్రామాలు బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించాం
- మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.60 వేల కోట్లు కేటాయించాం
- ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది
- ద్రవ్యోల్బణం 2009-14 మధ్య పదికి పైగా ఉంది
- పెరుగుతున్న ధరల నడ్డి విరిచాం
- ద్రవ్యోల్బణాన్ని 4.6 శాతానికి తీసుకొచ్చాం
- డిసెంబర్ 2018లో 2.19 శాతానికి తీసుకొచ్చాం
- ద్రవ్యలోటును కట్టడి చేశాం
- 239 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
- బ్యాంకులకు రూ.3 లక్షల కోట్ల రుణాలను రికవరీ చేయగలిగాం
- అవినీతి లేని ప్రభుత్వాన్ని నడిపాం
- రెరా, బినామీ ప్రాపర్టీ ప్రొహిబిషన్ లా తీసుకొచ్చాం
No comments:
Post a Comment